బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న చరణ్ ?

Tuesday, May 22nd, 2018, 09:24:53 PM IST


మేగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ బ్యాంకాక్ షెడ్యూల్ ఈ రోజుతో పూర్తీ చేసుకుంది . ఈ నెల 12 నుండి బ్యాంకాక్ లో షూటింగ్ మొదలు పెట్టిన ఈ యూనిట్ అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్ చరణ్ – ఖైరా అద్వానీ లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. సో రేపు ఇండియా తిరిగిరానున్న ఈ టీమ్ త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ని హైద్రాబాద్ లో జరుపుతారట. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా అటు బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొల్పింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులే ఏకంగా 18 కోట్లకు అమ్ముడుపోవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తో దుమ్ము రేపుతున్న రామ్ చరణ్ ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

  •  
  •  
  •  
  •  

Comments