ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన చరణ్ .. కారణం అదేనా ?

Friday, September 29th, 2017, 12:36:40 PM IST


సాధారణంగా ఒక హీరో ఫాన్స్ కు మరో హీరో ఫాన్స్ కు మధ్య ఎప్పుడు విభేదాలు ఉంటూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే హీరోల మధ్య ఎప్పుడు కూల్ వాతావరణమే ఉంటుంది. ఇక టాలీవుడ్ లో అయితే మెగా ఫాన్స్ కు అటు ఎన్టీఆర్ ఫాన్స్ కు మధ్య బద్ద విరోధమే ఉంది. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య మంచి స్నేహం ఉంది .. ఇద్దరు బావా బావా అంటూ పిలుచుకోవడమే కాకుండా పలు సందర్భాల్లో కలుస్తుంటారు కూడా. తాజాగా ఎన్టీఆర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ చేశాడన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. చరణ్ ఎందుకు ఎన్టీఆర్ కు ఫోన్ చేసినట్టు అన్న విషయం ఆసక్తి గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వందకోట్ల మార్కెట్ ను క్రోస్ చేసింది .. దానికి తోడు మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడు .. లేటెస్ట్ గా ఈ సినిమా చుసిన చరణ్, వెంటనే ఎన్టీఆర్ కు ఫోన్ చేసి … అద్భుతంగా నటించావని అబినందించాడట, మూడు పాత్రలకు పర్ఫెక్ట్ గా పోషించవని చెప్పినట్టు తెలుస్తోంది. నిజంగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండడం మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు .. అది విషయం !!

  •  
  •  
  •  
  •  

Comments