ధృవ.. ఈ సునామీని ఆపేదెవరు..?

Saturday, November 26th, 2016, 04:15:07 PM IST

druva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధృవ చిత్ర ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్ లో సునామిగా మారిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రేండింగ్ వీడియోస్ లో టాప్ లో కొనసాగుతోంది. ట్రైలర్ విడుదలైన ఐదు గంటల లోపే పదిలక్షల వ్యూస్ దక్కడం విశేషం.తమిళంలో ఘాన విజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి ఇది రీమేక్. ఇక ట్రైలర్ లో రామ్ చరణ్ స్టయిలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. రామ్ చరణ్ లుక్ హావభావాలు అతని గత చిత్రాలకంటే ఈ చిత్రం లో భిన్నంగా ఉన్నాయ్.

ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయనడంలో ఎలాంటి సందేశం లేదు.ఇక అగ్రదర్శకుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ ని మెచ్చుకున్నాడు. ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉందని అన్నాడు. చరణ్ నటన బావుందని కితాబిచ్చాడు. డిసెంబర్ 9 న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథ నాయికగా నటిస్తుండగా అల్లుఅరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.