జపాన్లోనూ దుమ్ము రేపుతున్న మన “మగధీర(రు)డు”..!

Wednesday, September 5th, 2018, 03:57:15 PM IST

“మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” హీరోగా, “బాహుబలి” చిత్రంతో యావత్తు ప్రపంచ సినిమా ప్రేక్షకులను తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు “రాజమౌళి” గారి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సోషియోఫాంటసీ, ప్రేమ కథా చిత్రం “మగధీర”. 2009 లో కేవలం ఒక్క తెలుగు భాషలోనే విడుదల అయ్యి అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న కలెక్షన్ పరంగా ఉన్న రికార్డులను మరియు శత దినోత్సవ రికార్డులను తిరగరాసేసింది. కలెక్షన్స్ లో ఈ చిత్రాన్ని ఇప్పటికి చాలా చిత్రాలు చిత్రాలు దాటేసినా కానీ వంద రోజుల రికార్డుని కొట్టడం లో మాత్రం విఫలమయ్యాయి అని చెప్పాలి.

అయితే “బాహుబలి 2” చిత్రంతో జపాన్ లో మన భారతీయ చిత్రాలకు కూడ అమితమైన ఆధరణ దక్కుతుంది అందులోను రాజమౌళి చిత్రాలను ఐతే మరింత అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ బాహుబలి 2 రిలీజ్ అయ్యి అక్కడ మన భారతీయ సినిమాల్లో కల్లా అత్యధిక వసూళ్లు సాధించింది. ఇదే స్ఫూర్తి తో అదే రాజమౌళి దర్సకత్వం వహించిన “మగధీర” చిత్రంని కూడా విడుదల చేశారు. బాహుబలి 2 అక్కడ 1.3 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యగా, మగధీర చిత్రం మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 1.09 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును మగధీర దాటుతుంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఏది ఏమైనా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఘనత మాత్రం “రాజమౌళి” గారికే చెందుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments