షాకిస్తున్న `రంగ‌స్థ‌లం` ఆడియో రైట్స్‌

Sunday, March 4th, 2018, 08:14:46 PM IST


డిజిట‌ల్ రైట్స్‌, శాటిలైట్‌, ఆడియో రైట్స్ అంటూ నిర్మాత‌లు బాగానే ఆర్జిస్తున్నారు. సినిమాకి క్రేజు ఉండాలే కానీ, ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఢోకానే లేదు. క‌లిసొచ్చే కాలం వ‌స్తే, న‌డిచొచ్చే పిల్లాడు పుట్టిన చందంగా ప్ర‌స్తుతం తెలుగు సినీనిర్మాత‌ల‌కు బాగానే క‌లిసొస్తోంది. ఇటీవ‌లి కాలంలో చిన్న సినిమాలు సైతం భారీ క్రేజుతో వ్యాపారం చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అయితే అందుకు కార‌ణం డిజిట‌ల్‌లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థ‌లు పోటీప‌డుతూ ఆన్‌లైన్ రిలీజ్ రైట్స్‌ని తీసుకోవ‌డ‌మే కార‌ణం. ఇటీవ‌ల‌ రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థలం` శాటిలైట్‌ని 16 కోట్ల‌కు విక్ర‌యించార‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌లోనే ఈ సినిమా ఆడియో హ‌క్కుల కోసం ఏకంగా కోటిన్న‌ర చెల్లించేందుకు ఒప్పందం జ‌రిగింద‌ని తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే ఇదో పెద్ద డీల్‌. బాహుబ‌లి-2, ఆజ్ఞాత‌వాసి, స్పైడ‌ర్ వంటి చిత్రాల‌కు 2కోట్లు చొప్పున ఆడియో హ‌క్కుల‌కు చెల్లించార‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత అంత పెద్ద డీల్ చ‌ర‌ణ్ సినిమాకే ద‌క్కింది. ఈనెల 18న వైజాగ్‌లో ల‌క్ష‌మంది అభిమానుల మ‌ధ్య రంగ‌స్థ‌లం ఆడియో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.