రాశిఖ‌న్నా ఫ్యాన్స్ గురించి ఎంత మాట‌న్నాడూ!

Saturday, September 24th, 2016, 01:29:43 PM IST

ram-rashi-kanna
హీరోలు ఆడియో వేడుక‌ల్లో వాళ్ల గురించి, వాళ్ల ఫ్యాన్స్ గురించే ఎక్కువ‌గా మాట్లాడుతుంటారు. ఆ విష‌యాలు మాట్లాడ్డానికే టైమ్ స‌రిపోదు. కానీ రామ్ మాత్రం హీరోయిన్ ఫ్యాన్స్ గురించి కూడా మాట్లాడాడు. నిన్న‌నే `హైప‌ర్‌` ఆడియో వేడుక జ‌రిగింది. క‌థానాయిక‌గా న‌టించిన రాశిఖ‌న్నా గురించి రామ్ మాట్లాడాడు. “రాశిఖ‌న్నాతో క‌లిసి న‌టించ‌డం మంచి ఎక్స్‌పీరియ‌న్స్‌. రాశి ఫ్యాన్స్ స్లీప‌ర్ సెల్స్‌గా ఉంటారు. ఆమెకి స‌రైన ఒక్క హిట్టు ప‌డిందంటే వాళ్లంతా టెర్రరిస్టుల్లాగా బ‌య‌టికొస్తారు” అన్నాడు. అంటే రాశిఖ‌న్నాకి స‌రైన హిట్టు ప‌డ‌క‌పోయినా ఫ్యాన్స్‌ని సంపాదించింద‌నీ, ఇక హైప‌ర్‌తో బంప‌ర్ హిట్టు ల‌భించాక ఆ ఫ్యాన్స్ మోతాదేంటో తెలిసిపోతుంద‌ని రామ్ మాట‌ల్లోని అంత‌రార్థ‌మ‌న్న‌మాట‌. రామ్ హైప‌ర్ వేడుక‌లో నిజంగానే హైప‌ర్‌గా మాట్లాడాడు, హైప‌ర్‌గానే క‌నిపించాడు. త‌న టీమ్‌పైనా, గెస్టులుగా వ‌చ్చినవాళ్ల‌పైనా చెణుకులు విసురుతూ ఎంట‌ర్‌టైన్ చేశారు.