వన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తాను ప్రశ్నించను అంటూనే ప్రశ్నించిన వర్మ

Friday, January 27th, 2017, 01:03:41 PM IST

rgv
శుక్రవారం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక విలేకరి రాంగోపాల్ వర్మ గురించి ప్రశ్నించగా దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ ‘రాంగోపాల్ వర్మ కు ఒక పెళ్ళైన కూతురు ఉందని, అయినా ఆయన బూతు సినిమాలు చూస్తానని చెప్తాడని, అలాంటి వ్యక్తి గురించి తాను మాట్లాడానని, వర్మ తనను ఒక్కొక్కసారి పొగడొచ్చు, ఒక్కొక్కసారి తిట్టొచ్చు కానీ తాను మాత్రం పట్టించుకోనని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ కొంచెం ఘాటుగానే స్పందించారు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో మాట్లాడాను కానీ ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్లు గురించి తాను మాట్లాడలేదని వర్మ చురకలు అంటించారు.

నా జీవితం గురించి, నా లైఫ్ స్టైల్ గురించి, నా ఆలోచన విధానం గురించి దాచుకోకుండా, దాక్కోకుండా ‘నా ఇష్టం’ అనే పుస్తకం ద్వారా మొత్తం విప్పి రాసానని వర్మ ఇంకొక ట్వీట్ చేశారు.

వాళ్ళ ఇంట్లోవాళ్లనే ఏదో అన్నారని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను తిట్టారని, అయితే వాళ్ళు మాత్రం వేరే వాలా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడొచ్చా…? అదేనా వికాసం…? అని ఇంకొక ట్వీట్ లో ప్రశ్నించారు.