జీఎస్టీ వల్ల వర్మకు లాభం ఎంతో తెలుసా?

Wednesday, January 31st, 2018, 02:45:45 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ఎప్పుడు లేనంతగా జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ తో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. ఆ సినిమాను చూసిన కొంత మంది ప్రశంసలను అందిస్తుంటే మరికొంత మంది ఆర్జీవీ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ 19 నిమిషాల వీడియో వల్ల అర్జివి కి ఎంత లాభం వచ్చింది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే వర్మ ఈ సినిమాకు వివాదాలోతోనే ఖర్చు లేకుండా ఎక్కువగా ప్రమోషన్స్ చేశాడు. దీంతో అందరు ఆ వీడియో ఎప్పుడు వస్తుందా అనే ఎదురుచూశారు.

విడుదలైన రోజు సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. ఆ తరువాత మళ్లీ రిలీజ్ చేయడంతో కొంత మంది డాలర్లు పెట్టి చూస్తే మరికొంత మంది ఇండియన్ కరెన్సీ ఆన్ లైన్ ద్వారా పే చేసి ఎట్టకేలకు ఆ వీడియోను చూశారు. దీంతో వర్మకు దాదాపు 10 కోట్లవరకు లాభం వచ్చింది. వర్మ దాదాపు రూ.70 లక్షలు ఖర్చు పెట్టి జీఎస్టీ తీశాడు. అందులో ఎక్కువగా మియా మాల్కోవకి రెమ్యునరేషన్ అందగా.. సంగీతం అందించిన కీరవాణికి కి కొంత అందింది. ఇక జీఎస్టీ మొత్తం వర్మకి రూ.11 కోట్లవరకు అందించిందని సమాచారం. అందుకే పార్ట్ 2 కూడా తీస్తానని వర్మ చెబుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి వర్మ పార్ట్ 2 ఎవరితో చేస్తాడో చూడాలి.