దేవి గారు వింటున్నారా?.. పోల్ తో సమాధానం ఇచ్చిన వర్మ!

Tuesday, January 30th, 2018, 12:21:20 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా శృంగారం కాన్సెప్ట్ ని తెగ వినిపిస్తున్నాడు. రీసెంట్ గా GST షార్ట్ ఫిల్మ్ తో ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచిన వర్మ చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ ను అందుకున్నాడు. కొందరు అతన్ని పిచ్చివాడు అని కూడా సంబోధిస్తున్నారు. ఇక మహిళా సంఘాలు అయితే వర్మ పై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక వర్మ కూడా తనపై విమర్శలు చేస్తోన్న వారిపై కౌంటర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా సామాజిక కార్యకర్త దేవి గారు వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కూడా వర్మ కౌంటర్ వేశాడు. దీంతో పోలీస్ కేసు నమోదైంది. ఇక అసలు విషయానికి వస్తే.. దేవి గారు వింటున్నారా అని వర్మ ఒక ట్వీట్ చేశాడు. తను తీసిన జీఎస్టీ గురించి ఒక పోల్ నిర్వహించాడు. అయితే వర్మ అభిప్రాయానికి దాదాపు 73% మద్దతు పలుకగా వర్మ ఆ విషయాన్ని తెలుపుతూ దేవిగారు వింటున్నారా అని ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.