చిచ్చు రేపిన వర్మ ఫోటో.. పవన్ కళ్యాణ్ ని వదిలేది లేదు

Friday, August 23rd, 2019, 09:39:28 AM IST

రామ్ గోపాల్ వర్మకి తెలిసిన మార్కెటింగ్ స్ట్రాటజీ మరెవరికి తెలియదనే చెప్పాలి. తాను చేసే పనికి, తాను తీసే ప్రతి సినిమాకి ఎలాంటి సమయంలో అయినా, ఎంత తక్కువ సమయంలో అయినా క్రేజ్ తీసుకోని వచ్చే సత్తా ఉన్న దర్శకుడు వర్మ.. తనకి లాభం వస్తుందని అనుకుంటే మాత్రం ఎంతటి స్టార్ అయినా మాత్రం వర్మ గెలికి తీరుతాడు. గతంలో లక్ష్మి’స్ ఎన్టీఆర్ సినిమా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎలా టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడో అందరికి తెలుసు.

ఇక తాజాగా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇందులో జగన్ ని టార్గెట్ చేయటానికి ఏమి లేదు. ఆయనకి అనుకూలంగా తీస్తున్న సినిమా కాబట్టి, చంద్రబాబుని టార్గెట్ చేస్తే ఈసారి ఎలాంటి ఫలితం లేదని వర్మకి తెలుసు. దీనితో ఇక మిగిలింది పవన్ కళ్యాణ్, అతన్ని టార్గెట్ చేస్తే సినిమాకి కావాల్సినంత ప్రచారం లభిస్తుంది. దానిని ఉపయోగించుకొని కొన్ని రోజులు పాటు మీడియా డిబేట్స్ లో కనిపించవచ్చు. పవన్ ని వ్యతిరేకించే వాళ్ళు ఈ సినిమాని చూస్తారు, పవన్ ని అభిమానించే వాళ్ళు కూడా అసలేమీ చూపించాడు అంటూ ఈ సినిమాని చూస్తారు. వర్మ ప్లాన్ కూడా ఇదే కావచ్చు.

అందుకే నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అంటూ ఒక ఫోటో వదిలాడు వర్మ. సరిగ్గా పవన్ కళ్యాణ్ పోలికలు ఉన్న వ్యక్తిని తీసుకోని వచ్చి ఈ సినిమాలో పెట్టినట్లు ఉన్నాడు. దానిని బట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని కూడా గట్టిగానే టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. 2014 లో పవన్ పార్టీ పెట్టి బాబుకి మద్దతు ఇవ్వటం, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో దుమ్ములేపాలని వచ్చి కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయిన పవన్ రాజకీయ జీవితం గురించి ఇందులో ఉండే ఛాన్స్ ఉంది.