రాంగోపాల్ వర్మ ఒక పిచ్చోడు : సామజిక కార్యకర్త దేవి

Thursday, January 18th, 2018, 06:50:33 PM IST

వివాదాలకు పెట్టింది పేరు అయిన రామ్ గోపాల్ వర్మ తాజా లఘు చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఇటీవల విడుదలయిన దీని ట్రైలర్ ని ఉద్దేశించి సామాజిక కార్యకర్త దేవి మీడియాతో మాట్లాడుతూ మనిషి జంతువు కాదని, జంతువు స్థాయిని ఎప్పుడో దాటి వచ్చాడు కాబట్టే గోప్యత అవసరమని, మనుషులస్థాయిలో ఉండదలుచుకోలేదంటూ, ఇలాగే చూపించదలుచుకున్నామంటూ ఇటువంటి చిత్రాలు తీసి నాగరిక సమాజం లోని వారి పైకి వదలడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మేము మీ జంతు లోకంలోకి రావాలనుకోవడం లేదని వర్మని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది బూతు సినిమా కాదంటున్నారని, ఇటువంటి సినిమాలు శారీరక క్రూరత్వాన్ని చూపుతాయని, పోర్నోగ్రఫీ ఇటీవల ఎటువంటి దారుణాలకు దారితీస్తుందో రోజూ చూస్తూనే ఉన్నామని ఆమె దుయ్యబట్టారు. అయన లాంటి పిచోళ్లు చాలా మంది ప్రపంచంలో వున్నారని వర్మ ని ఉద్దేశించి ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు, శరీరం కలవారికి ప్రేరకాలు, ఇటువంటి బూతు సినిమాల అవసరం ఉండదని ఆమె అన్నారు. నేటి సమాజం లో సెక్స్ పై వున్న చెడ్డ భావాలను, చాదస్తాలను పోగొట్టాలనే ఇటువంటి చిత్రాలు తీస్తున్నాం అని అంటున్నారు కదా, నిజానికి పోర్నోగ్రఫీయే నిజమైన చాదస్తమని ఆమె ఆరోపించారు. రాంగోపాల్ వర్మ తీస్తోన్న ఈ చిత్రాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నేటి సమాజంలో ఈ బూతు చిత్రాలు యువతను పెడదోవ పట్టించడం లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఎన్నో నేరాలకు కారణం అవుతున్నాయని అన్నారు…