కండలు పెంచేసిన స్మార్ట్ హీరో రామ్!

Friday, June 8th, 2018, 03:36:18 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఫిట్ నెస్ లో చాలా మార్పులు తెస్తున్నాడు. గత కొంత కాలంగా ప్రతి సినిమాలో ఈ ఛాక్లేట్ బాయ్ స్టైల్ కొత్తగా ఉంటోంది. ఇక రీసెంట్ గా ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తూ కండలు చూపించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ విసిరిన ఛాలెంజ్ కు రామ్ డంబుల్స్ తో జిమ్ లో కష్టపడి వర్కౌట్స్ చేశాడు. తనను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్ అని చెబుతూ.. ఇప్పుడు నా అభిమానులకు ఫాలోవర్స్ కు ఛాలెంజ్ విసురుతున్నా. మంచిగా వర్కౌట్స్ చేసి చితకొట్టండి అంటూ రామ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం రామ్ హలో గురు ప్రేమకోసమే అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో త్రినాథరావు నక్కిన ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.