రామ్ తో మళ్లీ ఇద్దరు హీరోయిన్స్?

Monday, December 4th, 2017, 11:16:39 AM IST

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గత ఒకొంత కాలంగా సరైన హిట్స్ లేక చాలా సతమతమవుతున్నాడు. చివరగా నేను శైలజా సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అని అనుకున్నా మళ్లీ ఎప్పటిలానే తన కెరీర్ లో అపజయాలను ఎదుర్కొంటున్నాడు రామ్. రీసెంట్ గా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రామ్ నెక్స్ట్ మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో నేను లోకల్ డైరెక్టర్ త్రినాధరావు డైరెక్షన్ లో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే సినిమాలో మళ్లీ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ నివేద థామస్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో కొత్త హీరోయిన్ ని రామ్ కి సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతా సెట్ అయితే దిల్ రాజు త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments