ఆర్ ఎక్స్ దర్శకుడితో రామ్ మల్టి స్టారర్ ?

Tuesday, September 11th, 2018, 10:43:37 PM IST

యంగ్ హీరో రామ్ తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం అయన త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో హలొ గురు ప్రేమకోసమే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చినా ఈ సినిమా దసరాకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్ లేటెస్ట్ గా ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అజయ్ భూపతి తో సినిమాకు ఓకే చెప్పాడు. తాజాగా అజయ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడట. ఈ సినిమాలో రామ్ తో పాటు ఓ తమిళ హీరో కూడా నటిస్తాడట. అయితే ఆ హీరో ఎవరన్నా విషయం తెలియాల్సి ఉంది. రియలిస్టిక్ అంశాలతో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా సంచలన విజయాన్ని అందుకుంది . ఈ మధ్య హీరో రామ్ కు కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేకపోవడంతో వెనకపడ్డాడు. అందుకే ఈ దర్శకుడిని ఎంచుకున్నాడు. అన్నట్టు ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ లో తెరకెక్కనుంది.

  •  
  •  
  •  
  •  

Comments