పెళ్లంటే ఇలా అనేశావేంటి రామ్?

Thursday, September 29th, 2016, 12:55:33 AM IST

ram
టాలీవుడ్‌లో బ్యాచిల‌ర్ హీరోలంతా పెళ్లి చేసుకుని సెటిలైపోతున్న సీజ‌న్ ఇది. మొన్న‌టికి మొన్న అల్ల‌రిన‌రేష్, మంచు మ‌నోజ్ లాంటి హీరోలు పెళ్లి బంధంతో సంసార‌బంధ‌నంలోకి వెళ్లారు. ఇక ప్ర‌భాస్‌కి బ్యాండ్ బాజా మోగే సీన్ క‌నిపిస్తోంది. అయితే మ‌రి యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పెళ్లెప్పుడు?

ఇదే మాట రామ్‌నే అడిగితే ఏమ‌న్నాడో తెలుసా? కాస్త సిగ్గుప‌డుతూనే .. ఆ ఆలోచ‌న ఇప్పుడే లేదు .. టైమొస్తే అదే అవుతుంది అన్నాడు. ఎవ‌రినైనా ప్రేమించారా? హీరోయిన్ల‌లో ఎవ‌రైనా? అంటే అబ్బే అదేం లేదండీ అన్నాడు. రెస్టారెంట్‌కి వెళ్లి ఆర్డ‌ర్ ఇవ్వాలంటేనే ఎంతో ఆలోచిస్తాను. సెల‌క్టివ్‌గా ఉంటాను.. అంటూ పిల్ల‌ను వెతుక్కోవ‌డంలో ఇంకెంత సెల‌క్టివ్ గా ఉంటాడో చెప్ప‌క‌నే చెప్పేశాడు రామ్. మొత్తానికి అత‌డి మాట‌ల్ని బ‌ట్టి రాసి పెట్టి ఉంటే అదే అవుతుంది అని అర్థమైంది. రామ్ న‌టించిన హైప‌ర్ ఈనెల 30 న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లోనే రామ్ పెళ్లి మాట‌కు స‌మాధాన‌మిచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments