‘నేను శైల‌జ‌’ కాంబోలో మ‌రో చిత్రం

Wednesday, September 28th, 2016, 08:33:17 PM IST

ram-kishore-tirumala
యువ క‌థానాయ‌కుడు రామ్‌కి డీసెంట్ హిట్టిచ్చిన చిత్రం `నేను శైల‌జ‌`. కిషోర్ తిరుమ‌ల ఆ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా వెలుగులోకి వ‌చ్చాడు. రైట‌ర్‌గా ఎప్ప‌ట్నుంచో పరిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్న ఆయ‌న `నేను శైల‌జ‌`తో ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశం అందుకోవంతో పాటు, విజ‌యాన్ని కూడా సొంతం చేసుకొన్నాడు. దాంతో కిషోర్‌తో సినిమాలు చేయ‌డానికి స్టార్లు కూడా సిద్ధ‌మైపోయారు. తాజాగా ఆయ‌న వెంక‌టేష్‌తో `ఆడాళ్లూ మీకు జోహార్లు` అనే సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ రామ్‌తోనే సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా రామే ప్ర‌క‌టించాడు. `నేను శైల‌జ‌`లో కిషోర్ తిరుమ‌ల త‌న‌ని ప్ర‌జెంట్ చేసిన విధానం రామ్‌కి చాలా బాగా న‌చ్చింది. అందుకే ఆయ‌నకి మ‌రో అవ‌కాశాన్ని ఇచ్చాడు. మ‌రి ఈసారి తెర‌కెక్కే క‌థ కిషోర్ తిరుమ‌ల స్టైల్లోనే ఉంటుందా లేదంటే, రామ్ స్టైల్‌లోకి వ‌చ్చి సినిమా తీస్తాడా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments