సావిత్రి మొండిఘటం.. భర్త చెప్పినా వినలేదు: నటి రమాప్రభ

Saturday, June 2nd, 2018, 06:29:51 PM IST

సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అప్పట్లో సావిత్రి గారితో ఆమె సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. సావిత్రి అనారోగ్యంతో మంచాన ఉన్నప్పుడు కూడా రమాప్రభ ఉన్నట్లు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఆమెనే తెలియజేశారు. ఇకపోతే ఇటీవల విడుదలైన మహానటి సినిమా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలో చూపించిన విధంగా మహానటి సావిత్రి గారికి మద్యం అలవాటు చేయించింది జెమినీ గణేశన్ కాదని ఆమె గట్టిగా చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. సావిత్రి దగ్గర మొండితనం చాలా ఉండేది, చివరి రోజుల్లో జెమిని గణేశన్ సావిత్రి దగ్గర ఉన్నాడు. హాస్పిటల్ లో సావిత్రి దగ్గర కూర్చొని ఆమెతో పాటు ఉండేవాడు. బాధపడ్డాడు కూడా.. చివరివరకు సావిత్రిని ప్రేమించిన ఒకే వ్యక్తి జెమిని గణేశన్. అతని మొదటి భార్య మరియు ఆమె పిల్లలు కూడా సావిత్రి తో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. సినిమాలు నిర్మించడం వల్ల సావిత్రి ఎక్కువగా నష్టపోయారు. ఆ సినిమాల గురించి భర్త ఎంత చెప్పినా కూడా సావిత్రి వినలేదు. తాను మొండిగా పంతానికి పోయి సీనిమాలు తీసిందని అప్పుడు నేను సావిత్రికి దగ్గరగానే ఉన్నాను అని రమా ప్రభ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments