రామచంద్రయ్య విమర్శలు – ఎన్నికల సమయంలోనే కొత్త పథకాలా…?

Sunday, January 13th, 2019, 02:11:47 AM IST

ఏపీ లో ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ, ఇప్పుడు చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తున్నారని వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఎద్దేవా చేస్తున్నారు. ఇన్ని రోజులు గుర్తుకు రాణి కొత్త పథకాలన్నీ కూడా మీకు ఈ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వటున్నాయా అని చంద్రబాబు ని ప్రశ్నించారు. ఇవన్నీ కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకోడానికి వేసిన ప్రయత్నాలే తప్ప, టీడీపీ ప్రభుత్వానికి ప్రజలకి మంచి చెయ్యాలని అసలే అనుకోవడం లేదని విరామచంద్రయ్య విమర్శించారు. అంతే కాకుండా చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి చాలా కష్టపడుతున్నారని, అది అసలే సాధ్యం కాదని ఆయన అన్నారు.

శనివారం వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియాఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటే.. పథకాలను ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా మభ్యపెట్టే పథకాలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. గతంలోని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని కూడా పూర్తి చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు, మీ హయం లో ప్రజలు ఎక్కడ ఆనందంగా ఉన్నారో చూపించాలని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఇన్నిరోజులు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రలకు వచ్చిన మద్దతు చూసి చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే లేనిపోని మాటలు చెప్పి ప్రజలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు…