సీఎం జగన్‌కి రమణ దీక్షితులు ట్వీట్.. ఇంకా ఎదురుచూస్తుంటాం..!

Saturday, July 11th, 2020, 07:08:14 PM IST

టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మరోసారి సంచలన ట్వీట్ చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై సీఎం జగన్‌కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగవిరుద్ధంగా రిటైర్ చేయించారని అయితే వారందరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

అయితే సీఎం జగన్ కూడా తమను మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ టీటీడీ ఈవో, ఏఈవో ఇంకా చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తూ కోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే కోర్ట్ ఆదేశాల మేరకు, జగన్ మాట మేరకు ఇంకా తాము ఎదురుచూస్తుంటామని అన్నారు.