100 ఎక‌రాల ఆసామి ఫిలింఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ‌కు కార‌కుడు?

Saturday, February 18th, 2017, 10:00:52 PM IST


హైద‌రాబాద్‌లో సినిమా ఇండ‌స్ట్రీ ఎలా మొద‌లైంది? అందుకు ఆద్యులెవ‌రు? తెలుగువారికంటూ ఓ సినీప‌రిశ్ర‌మ ఉంది అంటే అందుకు దోహ‌దం చేసిన కీల‌క వ్య‌క్తులు ఎవ‌రు? అంటే ఈ ప్ర‌శ్న‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం చెప్పేయ‌డం క‌ష్టం.. అయితే నాడు తెలివైన‌, సాహ‌స‌వంతులైన కొంద‌రు యువ‌కులు ఉన్నార‌ని చెప్ప‌గ‌లం. ఐమ్యాక్స్ ర‌మేష్ ప్ర‌సాద్ గారి తండ్రి అయిన ఎల్‌.వి.ప్ర‌సాద్ గారు, మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు, ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎం.ఎస్‌.రెడ్డి వంటి సినీదిగ్గ‌జాల సాహ‌సాల జీవిత‌మే ఈరోజు తెలుగు సినీప‌రిశ్ర‌మ పాదుకోవ‌డానికి కార‌ణం అన్న సంగ‌తిని భావిత‌రాలు గుర్తు చేసుకోవాలి. అయితే అందులో శ‌తాధిక చిత్రాల నిర్మాత‌ డా.డి.రామానాయుడు పాత్ర విస్మ‌రించ‌లేనిది.

మూవీమొఘ‌ల్ డా.ద‌గ్గుబాటి రామానాయుడు 100 ఎక‌రాల భూస్వామి అయినా కారంచేడును విడిచి మ‌ద్రాసు వెళ్లిపోవ‌డం అట్నుంచి ఏకంగా త‌మిళ‌ప‌రిశ్ర‌మ నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను వేరు చేసేంత‌టి దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌డం.. అటుపై తానే ఓ సినిమా స్టూడియోని ప్రారంభించి హైద‌రాబాద్‌లోనే షూటింగులు జ‌రిగేలా చూడ‌డం, కేవ‌లం రాళ్లు ర‌ప్ప‌లు, తుప్ప‌లు డొంక‌ల‌తో నిండిన ఒక కొండ‌ను అప్ప‌గిస్తే దానిని స్టూడియోగా మ‌ల‌చ‌డం.. ఇదంతా సినిమాటిక్‌గానే జ‌రిగిపోయింది. మ‌ద్రాసు నుంచి ప‌రిశ్ర‌మ‌ను ఇటువైపు మ‌ళ్లించేందుకు పైన పేర్కొన్న పెద్ద‌లంతా కృషి చేశారు.
ఒక‌సారి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లో పాదుకున్నాక ఎదురే లేకుండా ఎదిగింది. అలా ఎదిగేలా చేయడంలోనూ రామానాయుడు కీల‌క‌భూమిక పోషించారు. 100 ఎక‌రాల పంట పొలాన్ని న‌మ్మ‌కుండా సినిమా ఇండ‌స్ట్రీని న‌మ్మిన మొన‌గాడు ఆయ‌న‌. అందుకే నాయుడు ఈజ్ ఆల్వేస్ గ్రేట్‌. (నేడు రామానాయుడు వ‌ర్ధంతి సంద‌ర్భంగా)