ఆ ప్రెస్టీజియస్ మూవీతో రంభ రీ ఎంట్రీ ?

Tuesday, May 15th, 2018, 03:15:21 PM IST

ఒకప్పటి సీనియర్ నటి రంభ ఒకానొక సమయంలో దాదాపు అందరూ పెద్ద హీరోల సరసన నటించారు. అప్పట్లో మంచి నటన, డాన్స్ లతో కుర్రకారుకి కిక్కెక్కించిన రంభ కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అయితే దేశముదురు చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆమె చేసిన అట్టాంటోడే ఇట్టాంటోడే పాట మాస్ ప్రేక్షకులకు మంచి గిలిగింతలు పెట్టింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ చిత్రంలో నాచోరే పాటలో ఆడిపాడిన విషయం తెలిసిందే. మంచి ట్రెండీ ఫాస్ట్ బీట్ తో సాగే ఆ సాంగ్ కూడా రంభకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

కాగా ఆమె ప్రస్తుతం మళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రేయేషన్స్ పతాకంపై ఎస్.రాధా కృష్ణ నిర్మిస్తున్న నూతన చిత్రంలో రంభ నటించనుందని, అందులో ఒక కీలకమైన పాత్రకు యూనిట్ ఆమెను ఎంపిక చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే తన చిత్రాల్లో సీనియర్ నటీమణులు స్నేహ, నదియా వంటి వారిని తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఒక పాత్ర రీత్యా రంభ అయితేనే సరిపోతుందని ఆమెను ఎంపిక చేశారట. అయితే ఈ విషయమై యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది…….

  •  
  •  
  •  
  •  

Comments