జగదేకవీరుడుగా రామ్ చరణ్ ?

Wednesday, May 30th, 2018, 04:34:07 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలయి సూపర్ హిట్ సాధించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్ర విజయంతో మంచి జోష్ మీద వున్నాడు మెగా పవర్ స్టార్. కాగా ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమాలు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే బోయపాటి సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుండగా, రాజమౌళి చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది, ఇందులో ఆయనతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇక బోయపాటి సినిమాకు సంబంధించి ఇటీవల రాజ మార్తాండ అనే టైటిల్ నిర్ణయించారని, సినిమా రాయల్ ఫ్యామిలీస్ నేపథ్యంలో సాగె చిత్రం కాబట్టి అటువంటి టైటిల్ పెట్టారని అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికారు చేశాయి.

అయితే ప్రస్తుతం మరొక టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే,మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల కలయికలో వచ్చిన ఒకప్పటి సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర టైటిల్ లో ఒక భాగం ‘జగదేకవీరుడు’ గా ఆ చిత్ర టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. కాగా చిత్ర యూనిట్ కూడా ఈ టైటిల్ కి ఎక్కువగా మొగ్గు చూపిందని, అందునా మెగా స్టార్ సినిమా టైటిల్ కావడంతో చరణ్ చిత్రానికి పక్కాగా సరిపోతుందని దీనిని నిర్ణయించారట. అయితే దీనిపై యూనిట్ సభ్యులనుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది……

  •  
  •  
  •  
  •  

Comments