అనుకున్నట్టుగానే “రజినీ” రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్..!

Saturday, September 8th, 2018, 07:47:56 PM IST

అనుకున్న విధం గానే “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” జపాన్ లో తలైవా పేరిట ఉన్న రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పటి వరకు అక్కడ “ముత్తు” పేరిట ఉన్న రికార్డును మన చిట్టిబాబు “మగధీర” పేరిట రాసేసుకున్నాడు.

మగధీర చిత్రం విడుదల అయ్యిన కేవలం 8 రోజుల్లోనే అన్ని భారతీయ సినిమాల రికార్డులను తుడిచి పెట్టేసి నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఫుల్ రన్ లో ఎంత కాసుల వర్షం కురిపిస్తాడో వేచి చూడాలి. జపాన్లోని ముత్తు సినిమా ఫుల్ రన్ లో 1.6మిలియన్(11.52కోట్లు) సాధించింది. కానీ మగధీర ఈ ఫుల్ రన్ ని కేవలం 8 రోజుల వ్యవధిలోనే 1.77మిలియన్(12.9కోట్లు) తో దాటేసింది. దీన్ని బట్టి జపనీయులకి మన మగధీర చిత్రం ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘనత అంత హీరో రామ్ చరణ్, ఆ చిత్రాన్ని రచించిన విజయేంద్ర గారికి, అద్భుతంగా చిత్రీకరించిన రాజమౌళి అండ్ టీం కి చెందుతుంది. ఏదైతేనేం బాహుబలి చిత్రం వల్ల మన తెలుగు వాడి సత్తా ఏంటో ఈ ప్రపంచం రుచి చూస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments