తూ.గోలో బాహుబ‌లి రికార్డు కొట్టేసిన చెర్రీ!

Thursday, June 7th, 2018, 02:15:39 PM IST

రంగ‌స్థ‌లం త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్‌కి ట్రేడ్‌లో మాంచి ఊపొచ్చింది. ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అందుకోవ‌డంతో ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ -బోయ‌పాటి సినిమా ఎవ‌రూ ఊహించ‌ని బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని చాలా ముందే అమ్మేశార‌ని వార్త‌లొచ్చాయి. ఆ క్ర‌మంలోనే తూ.గో జిల్లా హ‌క్కుల్ని భారీ ధ‌ర‌కు కోట్ చేయ‌డంపై వాడివేడిగా చ‌ర్చ‌కొచ్చింది.

రంగ‌స్థ‌లం గోదారి జిల్లాల్లో బంప‌ర్‌హిట్. గోదారి సెంటిమెంటు, యాస‌-భాష‌తో వ‌చ్చిన ఈ సినిమా వ‌సూళ్ల‌లో కుమ్మేసింది. ఆ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమాకి తూ.గో జిల్లా హ‌క్కుల్లో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఒక పేరున్న బ‌య్య‌రు ఏకంగా 9.5 కోట్లు ఆఫ‌ర్ చేశాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అది బాహుబ‌లి కంటే పెద్ద మొత్త‌మేన‌ని చెబుతున్నారు. ఆ ర‌కంగా చ‌ర‌ణ్ తూ.గో జిల్లాలో బాహుబ‌లి రికార్డును బ్రేక్ చేసిన‌ట్టే. అలానే ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేసేందుకు తేదీని లాక్ చేశార‌ని తెలిసింది. సేమ్ టైమ్‌ బాల‌కృష్ణ `ఎన్టీఆర్‌`, వెంకీ-వ‌రుణ్‌తేజ్‌ల‌ `ఎఫ్‌2` రిలీజవుతున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments