చరణ్ అభిమానుల పండుగ సంబరం!

Thursday, January 25th, 2018, 11:39:41 AM IST


మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సమంత కథానాయికగా సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న నూతన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం తాలూకు టీజర్ నిన్న సాయంత్రం విడుదలయింది. నెట్ లో విడుదల అయినప్పటినుండి టీజర్ పలు సంచలనాలు రేపుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఐదు మిలియన్ వ్యూలు అందుకున్న ఈ టీజర్ పలువురి ప్రసంశలు కూడా అందుకుంటోంది. అల్లు అర్జున్, రాజమౌళి, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి కొంత మంది ప్రముఖులు కూడా టీజర్ అద్భుతమని మెచ్చుకుంటున్నారు. టీజర్ కి రెస్పాన్ అదిరిపోవడం తో చరణ్ అభిమానులు, టీజర్ అదిరిపోయింది అని అరుస్తూ ఆయన ఇంటిముందు బాణ సంచా కాల్చి పండుగ చేసుకున్నారు. వారు బాణ సంచా కాలుస్తోన్న వీడియో ని ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. మీకు టీజర్ నచ్చినందనుకుంటున్నాం, అభిమానులకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసారు. టీజర్ విడుదలయ్యాక అభిమానులను చూడటానికి ఇంటి నుండి బయటకు వచ్చిన చరణ్ టీజర్ ఎలా వుంది అని సైగలు చేయగా వారు, చాలా బాగుంది అని కేకలు వేసినట్లు తెలుస్తోంది. అందరికి ధన్యవాదాలు తెలిపిన చరణ్ తరువాత ఇంట్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చ్ నెల 30 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఒక సినిమా, రాజమౌళి తో యన్ టి ఆర్ కలయికలో మల్టీస్టారర్ లో నటించనున్నారు….