ఫైట్ ఫినిష్ చేసోచ్చా : రామ్ చరణ్

Saturday, May 5th, 2018, 10:34:33 AM IST

రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం మూవీతో మహా ఖుషీగా ఉన్నాడు. కెరీర్ బెస్ట్ హిట్ మాత్రమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టి కొత్త రికార్డులను సెట్ చేశాడు. రంగస్థలం ను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్కరికీ బంపర్ ప్రాఫిట్స్ అందించి.. అసలు సిసలైన బ్లాక్ బస్టర్ కు అర్ధం చెప్పాడు మెగా పవర్ స్టార్.

ఒకవైపు ఈ సంబరాలు కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు తన మరుసటి సినిమాను కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు చెర్రీ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు చెర్రీ. హీరో ఇలా వచ్చాడో లేదో.. తనకు బాగా పట్టున్న యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ స్టార్ట్ చేసేశాడు దర్శకుడు బోయపాటి. ఇంటర్వెల్ సీన్ కు ముందు వచ్చే ఈ ఫైట్ సీన్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని.. మూవీ మొత్తానికి హైలైట్ గా నిలిచేంతటి యాక్షన్ డోస్ ఉంటుందని అంటున్నారు. ఈ ఫైట్ సీన్ పిక్చరైజేషన్ ఇప్పుడు పూర్తయిపోయిందని తెలుస్తోంది.

రామ్ చరణ్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించనున్నాడు. కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్.. స్నేహలు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను.. దసరా నాటికి ఫినిష్ చేసే టార్గెట్ ను సెట్ చేసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేసి.. ఈఏడాది రెండో సినిమా కూడా ఇచ్చేసి.. గతేడాది మూవీ లేని లోటును భర్తీ చేయనున్నాడు చరణ్.