మగధీర రికార్డుల మోత..మరో 100 కోట్ల షేర్ క్లబ్ లోకి వెళ్లనున్న చరణ్..!

Thursday, September 20th, 2018, 07:13:52 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర వసూళ్ల సునామి జపాన్ లో ఆగట్లేదు.2009 లో విడుదలయ్యి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు.అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటిని తుడిచి పెట్టేసింది ఈ చిత్రం. బాహుబలి చిత్రం తర్వాత మన తెలుగు చిత్రాలకి ఇంకా హైప్ వచ్చింది,అదే ఊపులో మగధీర చిత్రాన్ని జపాన్ ప్రేక్షకుల ముందు పెట్టారు.అంతే అక్కడ కూడా మగధీరుడు ఒక్క రికార్డును కూడా వదిలిపెట్టలేదు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం యొక్క 11.52కోట్ల షేర్ ని అంత పెద్ద హిట్ అయిన బహుబలి2 చిత్రమే బద్దలు కొట్టలేకపోయింది.అలాంటిది మగధీర చిత్రం కేవలం 8 రోజుల వ్యవధిలోనే భారతీయ అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది.దీని బట్టి అక్కడి ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంత బాగా నచ్చిందో అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో 100కోట్ల బోణీ కొట్టేసాడు,ఇప్పుడు మళ్ళీ మగధీర చిత్రంతో రెండో 100కోట్ల షేర్ చిత్రం కొట్టడానికి దూసుకుపోతున్నాడు,ఇప్పటికే ఈ చిత్రం జపాన్ మినహాయించి 83.10కోట్ల షేర్ రాబట్టింది,ఇప్పుడు జపాన్లో కేవలం 17 రోజుల్లోనే 15.2 కోట్ల షేర్ ని రాబట్టింది దీనితో దాదాపు 98 కోట్ల షేర్ ని మగధీర రాబట్టింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో రెండు కోట్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు,దీనితో రామ్ చరణ్ మరో 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరిపోనున్నాడు.ప్రభాస్ తర్వాత మళ్ళీ రెండు 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్న ఏకైక టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అవ్వబోతున్నారు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.