`ఛాలెంజ్ 2`లో మెగాప‌వ‌ర్‌స్టార్‌?

Sunday, June 10th, 2018, 11:54:12 AM IST

మెగాస్టార్ న‌టించిన ఛాలెంజ్ చిత్రం గురించి తెలిసిందే. 90ల‌లో రిలీజైన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌ని కీల‌క మ‌లుపు తిప్పిన సినిమా. ఈ క్లాసిక్ సినిమాకి ఇప్ప‌టికీ బుల్లితెర‌పై త‌ర‌గ‌ని ఆద‌ర‌ణ ఉంది. డ‌బ్బు సంపాదించాలంటే తెలివితేట‌లు ఉంటే చాలు.. ఎంత‌టి పెద్ద వాడిని అయినా ఛాలెంజ్ చేయొచ్చు అని మెగాస్టార్ ఆ చిత్రంలో నిరూపించారు. మైండ్‌బ్లోవింగ్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కిన ఈ మేటి చిత్రాన్ని కె.ఎస్‌.రామారావు నిర్మించారు.

తాజాగా మ‌రోసారి రామ్‌చ‌ర‌ణ్ హీరోగా కె.ఎస్‌.రామారావు ఓ భారీ చిత్రం నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. తేజ్ ఆడియో ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఈ విష‌యాన్ని డిక్లేర్ చేశారు. మెగా నిర్మాత‌గా ఆ కాంపౌండ్‌కి ఎంతో క్లోజ్ అయిన కె.ఎస్‌.రామారావు ఒక‌వేళ చ‌ర‌ణ్‌తో సినిమా తీయాల్సి ఉంటే అది క‌చ్ఛితంగా `ఛాలెంజ్ 2` తీయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అలాంటి క‌థ‌తో ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు వ‌స్తారా? అన్న‌ది వేచి చూడాలి.