జపాన్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకున్న రామ్ చరణ్..!

Tuesday, September 11th, 2018, 11:53:08 AM IST

మగధీర చిత్రం మన తెలుగులోనే కాకుండా జపాన్ లో కూడా విడుదల అయ్యి దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ విడుదల అయ్యిన భారతీయ సినిమాలు అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది ఈ సినిమా. దీనికి కారణం ఆ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు అంతలా ఆరాధించడమే. వారికి ఈ సినిమా ఎంత పిచ్చిగా నచ్చింది అంటే ఆ చితం లో ఉన్న పాత్ర దారుల యొక్క వేషాధారణను వారు కూడా ధరిస్తున్నారు. అంతలా వారికి ఈ చిత్రం హత్తుకుపోయింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ తన చిత్రం పట్ల పాశ్చాత్త్యా దేశీయులు ఇంత ప్రేమని కనబరచడం తో తన యొక్క ఆనందాన్ని ఫేస్ బుక్ వేదికగా పంచుకున్నారు. “తన మీద ఇంత అమితమైన ప్రేమను కనబరుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉంది అని ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు”. అంతే కాకుండా తనకి ఇంతటి అద్భుత చిత్రాన్ని ఇచ్చినందుకు దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments