భారీ స్థాయిలో చరణ్, ఎన్టీఆర్ ల చిత్రం !

Wednesday, January 17th, 2018, 09:14:56 AM IST

సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ తర్వాత కొన్నాళ్ల విరామం ఇచ్చి తీస్తున్న చిత్రం చరణ్-ఎన్టీఆర్ ల ముల్టీస్టారర్ అని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి. అయితే ఈ చిత్రమై ఒక విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిల రెమ్యూనరేషన్ మినహాయించి కేవలం చిత్ర బుడ్జెట్టే దాదాపు 90 కోట్ల రూపాయలు అనే ఒక వార్త ఇప్పుడు సంచలనం గా మారింది. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ మరియు కొంత మంది రైటర్ ల టీం అంత కలిసి ఈ చిత్ర స్క్రిప్ట్ పై కష్టపడి పనిచేస్తున్నారట.

చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటిస్తుస్తున్న ఈ చిత్రం ఒక కంప్లీట్ ఫ్యామిలి అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ముఖ్యంగా ఈ చిత్రంలో ఎటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండవని చెపుతున్నారు. అన్ని కుదిరితే ఈ సంవత్సరం అక్టోబర్ లో చిత్రం సెట్స్ పైకి వెళ్లవచ్చని తెలుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి మలి సంవత్సరం 2019 దసరా కానుకగా తెలుగు, తమిళం తో పాటు హిందీలోనూ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం ఎంపిక త్వరలో మొదలవుతుందని సమాచారం.