మ‌హేష్ ప‌వ‌ర్‌ఫుల్.. చెర్రీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

Tuesday, April 24th, 2018, 08:58:42 PM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` 100 కోట్ల క్ల‌బ్ నుంచి 150 కోట్ల క్ల‌బ్ వైపు అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి వారంలో 150 కోట్ల గ్రాస్‌, 100 కోట్ల షేర్ వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఈ విజ‌యోత్సాహంలో చిత్ర‌యూనిట్ థాంక్స్‌మీట్‌లు, పార్టీల‌తో ఆద్యంతం ఎంజాయ్ చేస్తోంది. నిన్న‌టి సాయంత్రం జెఆర్‌సీ లో థాంక్స్ మీట్ అనంతరం హైద‌రాబాద్ – పార్క్ హ‌య‌త్‌లో పంపిణీదారులంద‌రికీ మ‌హేష్ అదిరిపోయే పార్టీ ఇచ్చార‌ని తెలిసింది. ఈ విజ‌యంపైనా, సినిమా వీక్షించిన ప‌లువురు సెల‌బ్రిటీలు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తొలిగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `భ‌ర‌త్ అనే నేను` చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌హేష్ న‌ట‌న‌, కొర‌టాల నేరేష‌న్ అద్భుతం అంటూ పొగిడేశారు. అటుపై అనీల్ రావిపూడి, వంశీ పైడిప‌ల్లి, రామ్ ఆచంట‌, ర‌వి.కె.చంద్ర‌న్‌, ఎన్టీఆర్ వంటి ప్ర‌ముఖులు మ‌హేష్ న‌ట‌న‌ను కొనియాడారు. కొర‌టాల అద్భుతంగా తీశాడంటూ ప్ర‌శంసించారు. లేటెస్టుగా భ‌ర‌త్ షో వీక్షించిన రామ్ చ‌ర‌ణ్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. “క్లాసిక్ సినిమాకి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ప్రిన్స్ మ‌హేష్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ గా పెర్ఫామ్ చేశారు. శివ అందంగా క‌థ‌ రాసుకుని, చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. దేవీ శ్రీ‌ సూప‌ర్భ్‌. దేవీ సంగీతం, ఆర్‌.ఆర్ బాగా ఎంజాయ్ చేశాను. కియ‌రా ఆరంభం రాకింగ్‌. దాన‌య్య గారికి, భ‌ర‌త్ టీమ్‌కి నా శుభాకాంక్ష‌లు“ అని అన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి త‌న‌తో 10 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడి ప్ర‌శంస‌లు కురిపించార‌ని నిర్మాత డి.వి.వి.దాన‌య్య థాంక్స్‌మీట్‌లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.