రంగ‌స్థ‌ల వాసి `రాజ వంశ‌స్తుడు`

Sunday, April 15th, 2018, 10:28:21 PM IST


రామ్‌చ‌ర‌ణ్ – బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్ర‌ణ‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా 20ప‌ర్సంట్ అయినా చిత్రీక‌ర‌ణ అవ్వ‌క‌ముందే.. ప్రీరిలీజ్ బిజినెస్ ఓరేంజులో సాగుతోంద‌న్న స‌మాచారం ఉంది. ఈ క్రేజీ మూవీ హిందీ శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ 22కోట్ల మేర బిజినెస్ చేశాయ‌ని .. ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ చానెల్ శాటిలైట్ హ‌క్కులు ద‌క్కించుకుంద‌ని చెప్పుకున్నారు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ క‌న్ఫామ్ అయింద‌ని చెబుతున్నారు.

కాస్త క్లాసీగా `రాజ‌వంశ‌స్తుడు` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని, అందుకు త‌గ్గ‌ట్టే రాజులు- రాజ్యాల‌పై తెర‌కెక్కుతున్న క్లాసిక్ సినిమా ఇదని మాట్లాడుకుటున్నారు. స‌ల్మాన్ `ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో`ఇన్‌స్పిరేష‌న్‌తో లైన్ తీసుకుని తెలుగైజ్ చేసి తీస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ఈ మూవీలో త‌మ‌న్నా ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించ‌నుంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతానికి టైటిల్ క‌న్ఫామ్ చేయ‌లేదు.. చ‌ర్చ‌ల్లో ఆ టైటిల్ తెర‌పైకొచ్చింది. క‌న్ఫామ్ అయితే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments