శ్రీరెడ్డి ని ఉద్దేశించి రాంచరణ్ ఘాటు రిప్లై !

Wednesday, April 18th, 2018, 08:00:07 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఇటీవల జనసేన అధినేత పవన్ ను, అన్న మీరు ఒక మహిళ ఈ విధంగా నష్టపోతే మీరు మాట్లాకుండా ఎందుకున్నారు. నాలానే పలువురు ఆర్టిస్ట్ లు ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నారు. మీరు మాట్లాడాలి అని మీడియా ముఖంగా కోరింది. అయితే శ్రీరెడ్డి విషయమై పవన్‌ స్పందిస్తూ. ఆమె టీవీ చానెళ్లకు వెళ్లడం కంటే, పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని అన్నారు.

దీనిపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ, పవన్‌ను అన్నా అని పిలిచినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. అంతేకాకుండా పవన్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించారు. కాగా ఆమె ఆ విధంగా పవన్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పవన్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయిధరం తేజ్‌ పరోక్షంగా స్పందించారు. తాజాగా మరో మెగా హీరో రాంచరణ్‌ కూడా పరోక్షంగా మౌనాన్ని వీడారు. ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ.

మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతం గా పరిష్కరించుకోవాలి’ అని ఫేస్‌బుక్‌లో సూచించారు. కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనమంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. శ్రీరెడ్డి కామెంట్‌పై పవన్‌ మాట్లాడుతున్న వీడియోను కూడా చెర్రీ పోస్ట్‌ చేశారు. వీడియోలో పవన్‌ మాట్లాడుతూ ‘నాపై కామెంట్లు చేస్తుంటారు. వాటన్నింటినీ భరిస్తాను. నన్నేమన్నా అంటే మీకు కోపం వస్తుంది. కానీ అది తప్పు. భరిద్దాం. చూద్దాం ఎంత వరకు తిడతారో. భరించేవాడే బలవంతుడు. భరించేవాడే గెలుస్తాడు. అప్పుడే ఎదుటివారిలోనూ మార్పు కలుగుతుంది’ అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments