క్యాస్టింగ్ కౌచ్ సీక్రెట్స్ బయట పెట్టిన ఆర్జీవీ…

Tuesday, April 10th, 2018, 05:53:54 PM IST

కొత్త హీరోయిన్లకు సినాల్లో చాన్సులు దొరక్క క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతూ నలుగుతూన్న విషయం ఇపుడు టాలీవుడ్‌లో ఇప్పుడు థియేటర్ లో దొరికే గరం సమోసా కంటే వేడిగా మారింది. ఇటివల ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను వివరించారు. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ప్రొడ్యూసర్. నాకు కూడా బాగా తెలుసు. ఆయన దగ్గరకు ఓ అమ్మాయి వెళితే నేను నిన్ను హీరోయిన్‌ను చేస్తాను కానీ కాంప్రమైజ్ అవ్వాలి, కమిట్ మెంట్ ఇవ్వాలి అన్నారట. ఆ అమ్మాయి వచ్చి నాకు ఈ విషయాన్ని చెప్పింది. నేను నిజంగా ఒక్కసారిగా షాక్ అయ్యాను అన్నాడు ఆర్జీవి. అసలు విషయం ఏమిటంటే ఆయన నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడతారని నేను కలలో కూడా ఊహించలేదు.. ఆ విషయం నమ్మడానికి కూడా ఒక్కోసారి ఒళ్ళు గగ్గురు పొడిచేది అని బాధ పడ్డాడు. ఆయన రెప్యుటేషన్.. ఆయనకున్న ఇమేజ్‌ను బట్టి నేను నమ్మలేను అన్నాను ఆ అమ్మాయితో. అపుడు ఆ అమ్మాయి నా ఎదురుగా అతనికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి.. ‘సార్ నిన్న నేను మీ ఆఫీస్‌కి వచ్చినపుడు అంతా మాట్లాడి బయటకు వెళుతున్నప్పుడు నన్ను మీరు కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు కదా.. నాకు అర్థం కాలేదు సార్.. ఏంటీ కాంప్రమైజ్’ అని డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో అడిగింది. ‘యూ నో ఎవ్రీథింగ్’ అని నవ్వుతూ అన్నాఋ ఆ ప్రొడ్యుసర్. నేను వాయిస్ గుర్తు పట్టాను. ‘లేదు సార్ నాకు అర్థం కాలేదు ఏంటండి కాంప్రమైజ్’ అని అడిగింది. ‘కాంప్రమైజ్ అంటే ఎవరికి తెలియదమ్మా.. అది అందరికీ తెలిసిన పదమే కదా’ అన్నారాయన. ‘నిజంగా నాకు అర్థం కావడంలేదు. మీరు డబ్బులు తక్కువిస్తారా?’ అని ఏమీ తెలియనట్టు మొహం పెట్టి అడిగిందా అమ్మాయి.

లేదు అమ్మ అలాంటిది ఏమీ లేదు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నువ్వే చెప్పు నీకెంత ఎంత కావాలో’ అని ముక్కుసూటిగా అన్నారు ఆ ప్రొడ్యుసర్. ‘అంటే ఇంకేంటండి కాంప్రమైజ్? సినిమాలో నా పాత్ర మంచిది కాదా అండి’ అని అంది. ‘హీరోయిన్ రోల్ అంటే మంచిది కాదా అంటే ఏమనాలి?’ అన్నారాయన. అలా అనగానే ఇక చేసేదేం లేక ‘కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా?’ అని అంది ఆ అమ్మాయి. ‘అప్పుడాయన యూ నో ఎవ్రీథింగ్. మళ్లీ నన్ను అడుగుతావేంటి?’ అన్నారాయన. ‘మీ సినిమాలో ఫలానా హీరో.. ఫలానా డైరెక్టర్.. వాళ్లు తీసుకుంటారండి.. హీరోయిన్‌ని.. మీతో పడుకుంటే మీరెలా డెసిషన్ తీసుకుంటారు? నన్ను హీరోయిన్‌గా చేయడానికి అంత పెద్ద హీరో పక్కన.. అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో’ అని అడిగింది. ‘ఏయ్ హూ ఆర్‌దే.. వాళ్లను ఇండస్ట్రీ నుంచి తన్ని తరిమేస్తా నా గురించి నీకు తెలియదు’ అని చివాట్లు పెడుతూ హీరో, డైరెక్టర్ పేర్లు చెప్పేశాడు. ఇదంతా నేను ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేస్తే వింటూ కూర్చున్న. తను ఫైనల్‌గా ‘సరే సార్ నేను మళ్లీ ఆలోచించుకుని రేపు చెబుతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇదంతా రికార్డ్ చేశానని చెప్పింది. ఇది నేను యూట్యూబ్‌లో పెడితే వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ హీరో పేరు, ఆ డైరెక్టర్ పేరు అందరికీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసు. ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు. ప్రతి అమ్మాయి ఫోన్‌లో అందరి సీక్రెట్లు ఉంటాయి. మీరు ఇమాజిన్ చేయలేరసలు అని వెల్లడించారు వర్మ. కాబట్టి ప్రొడ్యుసర్లైనా, డైరెక్టర్లైనా, హీరోలైనా ఎవరిపని వాళ్ళు చేస్కుంటే మంచిది, అనవసరంగా లేని పోనీ విషయాల్లో తలదూర్చి 5 నిమిషాల సుఖం కోసం ఎదుటి వారి జీవితాలను నాశనం చేయొద్దని దర్శకుడు రాం గోపాల్ వర్మ సెలవిచ్చాడు.