చంద్రబాబుని చూస్తే బ్రహ్మనందం కామెడీ.. రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Thursday, July 11th, 2019, 06:47:56 PM IST

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ఈ సారి ఎన్నికలలో వైసీపీ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఇక టీడీపీ ఐదేళ్ళు గడిచినా పుంజుకునేటట్టు మాత్రం కనిపించడంలేదు. అయితే ఇలాంటి తరుణంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోతున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ పాలనపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అప్పుడప్పుడు టీడీపీపై తన దైన శైలిలో కామెంట్లు విసురుతూ టీడీపీకి ఒక బద్ద శత్రువులా మారిపోయాడు. అయితే గతంలో ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఏపీలో విడుదల చేయనీయకుండా అడ్డుకున్నారని అనుకుని అందుకే టీడీపీపై వర్మ సెటైర్లు వేస్తున్నాడంటూ టీడీపీ నేతలు వర్మపై మండిపడుతున్నారు. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలలో జరుగుతున్న వాటిని ఉద్దేశించి వర్మ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని, కమేడియన్ బ్రహ్మనందం కామెడీనీ ప్రేక్షకులు చూసినప్పుడు ఏ విధంగా నవ్వుతారో చంద్రబాబును చూసినప్పుడు కూడా జగన్ అదే విధంగా నవ్వుతున్నారని అన్నారు. అంటే చంద్రబాబును పరోక్షంగా కమేడియన్ బ్రహ్మనందంతో పోల్చాడు వర్మ.