రామోజీ వ‌ర్సెస్ రాజ‌మౌళి! గొడ‌వ‌ నిజ‌మే!!

Saturday, June 9th, 2018, 11:23:38 AM IST

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి .. రామోజీరావు మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌లేదా? ఆ ఇద్ద‌రూ ఎడ‌మొహం పెడ‌మొహం ఇప్ప‌టికీ అలానే కంటిన్యూ అవుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. బాహుబ‌లి 1, 2 చిత్రాల్ని రాజ‌మౌళి రామోజీ ఫిలింసిటీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించారు. అందుకోసం ఏకంగా ఐదేళ్ల పాటు ఫిలింసిటీని అడ్డాగా వాడుకున్నారు. అయితే ఆ క్ర‌మంలో ఆర్ఎఫ్‌సీ నుంచి వ‌చ్చిన బిల్లుల్ని రాజ‌మౌళి- ఆర్కా మీడియా సంస్థ‌లు స‌రిగా చెల్లించ‌లేద‌ని వార్త‌లొచ్చాయి. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో రామోజీతో వ‌చ్చిన విభేధాల వ‌ల్ల మాటీవీకి వాటిని క‌ట్ట‌బెట్టార‌ని, ఆ క్ర‌మంలోనే రామోజీతో రాజ‌మౌళికి చెడింద‌ని ప్ర‌చార‌మైంది. ఈ వార్త‌లు వ‌చ్చిన స‌మ‌యంలోనే రామోజీ ఫిలింసిటీకి చెల్లించాల్సిన బిల్లుల్ని క్లియ‌ర్ చేశారు. అయినా వ‌దిలిపెట్ట‌ని రామోజీ దాదాపు 90 కోట్ల మేర అద‌న‌పు బిల్లుల్ని రాజ‌మౌళి-ఆర్కా సంస్థ‌ల‌కు పంపించార‌ని చెప్పుకున్నారు. ఆ బిల్లులు చూసి వీళ్ల‌కు దిమ్మ‌తిరిగిందని ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకున్నారు. అదంతా అటుంచితే.. రామోజీతో రాజ‌మౌళికి చెడింద‌నేందుకు ఓ ప్రూఫ్‌ని తాజాగా చూపిస్తున్నారు.

జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలోని తాజా మ‌ల్టీస్టార‌ర్ కోసం రామోజీ ఫిలింసిటీని ఎంచుకోక‌పోగా.. అల్యూమినియం ఫ్యాక్ట‌రీ వ‌ద్ద రెండెక‌రాల లీజ్‌కు తీసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఫిలింసిటీతో ప‌ని లేకుండా రాజ‌మౌళి ఇలా ప్లాన్ చేశార‌ని భావిస్తున్నారంతా. రామ్‌చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్‌తో సినిమా సెట్స్‌కెళ్ల‌నున్న వేళ ప్ర‌స్తుతం ఈ వార్త వేడెక్కిస్తోంది. రామోజీతో మంచి సంబంధాలు క‌లిగి ఉంటే జ‌క్క‌న్న ఇలా చేసేవాడే కాదు క‌దా! అని చెప్పుకుంటున్నారు. రామోజీ అద‌న‌పు బిల్లులు పంపించిన మాట వాస్త‌వ‌మేన‌ని మ‌రోసారి చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments