పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటున్న మరో హీరోయిన్ ?

Monday, April 23rd, 2018, 11:57:48 AM IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న అంశం .. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారమే. అన్ని వుడ్స్ లో ఈ వ్యవహారం ఉందంటూ ఇప్పటికే పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసారు. ఇప్పటికే టాలీవుడ్ లో శ్రీ రెడ్డి లాంటి నటీమణులు ఇప్పటికే దుమారం రేపుతుండగా .. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్నది నిజమే అంటూ స్పందించింది గ్లామర్ భామ రమ్య నంబీశన్ ? పిజ్జా , సేతుపతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా ప్రభుదేవా నటించిన మెర్క్యురీ సినిమాలో నటించి ఆకట్టుకుంది.

ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న ఈమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి .. అందులో కాస్టింగ్ కౌచ్ ప్రశ్న కూడా ఉంది.. దీనికి సమాధానం చెబుతూ .. పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు ఎదురవ్వడం సహజమే అని పేరు వేరైనా కాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని రంగాల్లోనూ ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా రంగంలో అవకాశాల పేరుతొ సెక్సువల్ ఫెవర్ ఆశిస్తారని చెప్పింది. అయితే తనకు ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, పలువురు సహచర నటీమణులు చెప్పగా విన్నానని తెలిపింది. ఇలాంటి సంప్రదాయాన్ని అడ్డుకోవాలని, మహిళా నటులు దైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments