వై ఎస్ బయోపిక్ లో శివగామిదేవి ?

Thursday, April 19th, 2018, 10:02:22 PM IST


మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నా విషయం తెలిసిందే. యాత్ర పేరుతొ రూపొందుతున్న ఈ సినిమాను మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్మూటీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వై ఎస్ భార్య పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుండగా .. తాజాగా బాహుబలి లో శివగామిగా ఓ రేంజ్ లో నటించి ఆకట్టుకున్న రమ్యకృష్ణ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజగా ఆమెతో దర్శకుడు చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఈ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెనే ఎంపిక చేసేందుకు దర్శకుడు మహి ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి వై ఎస్ బయోపిక్ ని ఓ రేంజ్ క్రేజ్ తీసుకురావడానికి దర్శకుడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments