ఎన్టీఆర్ సినిమాలో… శివగామి ?

Thursday, April 26th, 2018, 10:58:15 AM IST

క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫిలిం సిటీ లో జరుగుతున్నా విషయం తెలిసిందే. ఫ్యామిలి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా నేటితో మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. రెండో షెడ్యూల్ ని మే 3 నుండి ప్లాన్ చేసారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్య కృష్ణ ను తీసుకున్నారట. త్రివిక్రమ్ సినిమాల్లో మాజీ హీరోయిన్స్ కీ రోల్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో కూడా ఓ కీ రోల్ పాత్ర ఉందని .. దానికోసం పలువురు సీనియర్ హీరోయిన్స్ ని పరిశీలించాక రమ్యకృష్ణ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments