వై.ఎస్ విజయమ్మ పాత్రలో రమ్యకృష్ణ

Friday, April 20th, 2018, 11:44:50 AM IST

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఒక కీలక వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ హావ తీవ్రంగా వున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ అంతటా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను 2004 , 2009 ,వరుసగా పార్టీ ని అధికారం లోకి తెచ్చాడు.

ఇప్పుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర. ఆ యాత్ర చూపిన ప్రభావం, ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో ముఖ్యమైన రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర కి రాజశేఖర మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి విజయమ్మ పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా మొదట్లో వార్తలు వినిపించాయి . ఇప్పుడు విజయమ్మ పాత్రకి రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో వై.ఎస్. జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments