పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారు: స్టార్ హీరో

Wednesday, January 24th, 2018, 06:31:24 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనాలతో పాటు సినీ ప్రముఖులు కూడా వ్యక్తిగతంగా ఆయన చాలా ఇష్టపడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది సినీ హీరోలు దర్శకులు పవన్ ని ఇష్టపడతారు. ముఖ్యంగా యువ హీరోలు ఆయనను అభిమానుల్లాగే కొలుస్తుంటారు.ఇక అసలు విషయానికి వస్తే ఆ లిస్ట్ లోకి మరో స్టార్ హీరో చేరిపోయాడు. పవన్ పై తన అభిమానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రానా పవన్ పై చాలా సార్లు పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. అయితే రీసెంట్ గా ఓ మీడియా సమావేశంలో రానా పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో రాణిస్తారని అంతే కాకుండా రజినీకాంత్ కూడా అనుకున్నది సాధిస్తారని వివరించారు. ఇక మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సినిమాల్లో అలా కనిపిస్తాను గాని నిజ జీవితంలో అలాంటివి చేయను అని రానా వివరించాడు.