రానా హిస్టారిక‌ల్ మూవీ అస‌లేమైంది?

Monday, June 4th, 2018, 03:13:16 PM IST

రానా స్పీడ్ చూస్తుంటే అడ్డూ ఆపూ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. వ‌రుస పెట్టి సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే హాతీ మేరీ సాథీ త్రిభాషా చిత్రం సెట్స్‌పై ఉంది. 1945 మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. స్టూవ‌ర్డ్‌పురం దొంగ‌ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌కి సంత‌కం చేశాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు వెళుతోంది. అయితే రానా న‌టిస్తున్న ఈ సినిమాల్లో ఈపాటికే 1945 రిలీజ్ కావాల్సింది. కానీ ఎందుక‌నో ఆల‌స్య‌మైంది. స‌మ్మ‌ర్ రిలీజ్ అని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కానీ ఎందుక‌ని ఈ ఆల‌స్యం? .. ఇదే ప్ర‌శ్న రానానే అడిగితే అస‌లు సంగ‌తి తెలిసింది.

1945 ప్రీఇండిపెండెన్స్ నేప‌థ్యంలోని క‌థాంశంతో తెర‌కెక్కుతున్న చిత్రం. ఈ సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. సుభాష్ చంద్ర‌బోస్‌.. ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంలో రానా ఒక సైనికుడు. అత‌డిపై విరోచిత పోరాటాల్ని తెర‌కెక్కించారు. అయితే ఇప్ప‌టికి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉందింకా. ఓ పాట‌ను తెర‌కెక్కించాల్సి ఉండ‌గా నిర్మాత‌ల త‌ర‌పున ఏదో స‌మ‌స్య వ‌చ్చిందిట‌. ప్ర‌స్తుతం దానిని రిజాల్వ్ చేసే ప‌నిలో నిర్మాత‌లు ఉన్నార‌ని రానా ఓ అభిమాని ట్వీట్ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. స‌త్య శివ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments