ఫోటో టాక్ : రూపం మార్చిన భళ్లాలుడు !

Tuesday, October 24th, 2017, 07:51:22 PM IST

భళ్లాల దేవుడిగా రానా ఉగ్ర రూపం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. బాహుబలిలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన రానా ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి ప్రయోగాత్మక చిత్రాలతో కూడా విజయాన్ని అందుకున్నాడు. రానా కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక చిత్రాల వైపే దృష్టి సారించాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరించడానికి రానా సిద్ధం అవుతున్నాడు.

రానా 1945 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో సరికొత్త లుక్ ని ట్రై చేయబోతున్నట్లు చెప్పిన రానా, గడ్డం తీసేసిన తన కొత్త రూపుని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 1945 కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నా. నవంబర్ లో ఫస్ట్ లుక్ విడుదలవుతుంది అని రానా ట్వీట్ చేశారు. రానా షేర్ చేసిన ఈ ఫోటో కొద్దీ సేపటికే వైరల్ గా మారింది. కాగా 1945 చిత్రం పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతోంది. కథానుసారం రానా ఈ చిత్రంలో కొత్త లుక్ తో దర్శమివ్వనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments