యుద్ధనేపథ్యంలో రానా మరో సినిమా?

Tuesday, May 8th, 2018, 03:10:41 PM IST

రానా హీరోగా నటించిన ఘాజి చిత్రం 1978 యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన కథతో తెరకెక్కింది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత రానా మరో యుద్ధ నేపథ్యంలో రూపొందించే సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో రానాతో కలిసి మరోసారి సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న తేజ తన నెక్స్ట్ సినిమా విషయంలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే వెంకటేష్, తేజ లతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు సాగించిన తేజకు అవేవి వర్కవుట్ కాలేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. దాంతో అయన మళ్ళీ రానా తోనే తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో రానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపిస్తాడట, సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెలువడనున్నాయి.