రానా నెక్స్ట్ టైటిల్ అదిరిందబ్బా ?

Monday, June 4th, 2018, 11:01:10 PM IST


బాహుబలితో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రానా తన ఇమేజ్ ని పెంచుకునేలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అయన హిందీలో చేస్తున్న చిత్రం హాథీ మేరె సాథి. ఏనుగుల స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కువగా అడవుల్లో షూటింగ్ జరుపుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగులో అరణ్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇక తమిళంలో కాదన్ అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమా పై రానా కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో అందుకున్న రానా మళ్ళీ ఈ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. దాంతో పాటు రానా హీరోగా మళ్ళీ మూడు భాషల్లో కలిపి చేస్తున్న 1945 సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.