రానాతో ఎఫైర్ లేద‌న్న అగ్ర క‌థానాయిక‌ !

Saturday, January 27th, 2018, 11:57:32 AM IST

హీరో-హీరోయిన్ల మ‌ధ్య ఎఫైర్ వార్త‌లు రావ‌డం చాలా స‌హ‌జం. స్నేహంగా మాట్లాడుకుంటే చాలు వెంట‌నే క‌థ‌లు అల్లేస్తుంటారు గాసిప్ రాయుళ్లు. ఆ ఇద్దరి మ‌ధ్యా ఏం జ‌రుగుతోందో.. అంటూ ఫ‌జిల్స్ వేస్తుంటారు. అలా ఇప్ప‌టికే రానాతో ప‌లువురు స్టార్ హీరోయిన్ల‌కు ఎఫైర్ న‌డుస్తోందంటూ వార్త‌లొచ్చాయి. ఈ జాబితాలో బిపాసా బ‌సు, శ్రీయ‌, న‌య‌న‌తార వంటి టాప్ హీరోయిన్ల పేర్లు వెలుగు చూశాయి. రానా బ్యాచిల‌ర్‌.. అందుకే ఈ రూమ‌ర్లు స‌హ‌జం అనుకున్నారంతా. అయితే ఈ రూమ‌ర్లు అన్నిటినీ కొట్టేసేలా ఇటీవ‌లి కాలంలో రానా – ర‌కుల్ మ‌ధ్య వ్య‌వ‌హారం ముదిరిపాకాన ప‌డుతోందంటూ వార్త‌లొచ్చాయి. ర‌కుల్‌- రానా మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రి సాన్నిహిత్యం అందుకు తావిస్తోంది! అంటూ బోలెడ‌న్ని రూమ‌ర్లు వెబ్‌ని ఠారెత్తించాయి.

అయితే అస‌లు మీ మ‌ధ్య ఎఫైర్ నిజ‌మా? అని ర‌కుల్‌ని ప్ర‌శ్నిస్తే ఏం చెప్పిందో తెలుసా? రానా – నేను మంచి స్నేహితులం మాత్ర‌మే. హైద‌రాబాద్‌లో నాకు త‌నే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. అంతేకాదు మేం కొంద‌రం క‌లిసి స్నేహంగా ఉంటాం. అందులో రానా, నేను సింగిల్స్‌. మాతో పాటు మ‌రో ముగ్గురు న‌లుగురు మాత్ర‌మే బ్యాచిల‌ర్స్‌. మిగ‌తావాళ్లంద‌రికీ పెళ్లి తంతు ముగిసింది. అందుకే మ‌మ్మ‌ల్ని ఇలా అనుకుంటున్నారు.. అంటూ సాఫ్ట్‌గా చెప్పింది. ఇంత‌కీ రానాతో ఎఫైర్ ఉన్న‌ట్టా లేన‌ట్టా? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం పూర్తి క్లారిటీతో ఆన్స‌ర్ రాలేదు.