కోడి రామ్మూర్తి బయోపిక్ లో రానా ?

Thursday, May 17th, 2018, 10:59:52 AM IST

మహానటి సక్సెస్ తో టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. ప్రస్తుతం బయోపిక్ సినిమాలు తెరకెక్కించాలనే దిశగా పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలే చేస్తున్నారు. తాజాగా మరో బయోపిక్ సినిమాకు రంగం సిద్ధం అవుతుంది. ప్రముఖ మల్ల యుద్ధ వీరుడు కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆంధ్రా లో కోడి రామ్మూర్తి గురించి తెలియని వారుండరు. పహిల్మాన్ గా మంచి పేరు తెచ్చుకున్న అయన ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేసాడట. అయన జీవితం పలువురికి ఆదర్శంగా ఉంటుందని అయన కథతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయన పాత్రలో రానా నటిస్తాడట. ఈ పాత్రకు రానా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని భావించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రానా ఓకే అంటే ఆ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments