రానా .. టైగర్ నాగేశ్వర రావు అవుతాడా ?

Saturday, January 6th, 2018, 10:35:49 AM IST


ఈ మధ్య రానా భిన్నమైన పాత్రల్లో నటించేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే పలు పాత్రల్లో ఆకట్టుకున్న రానా ప్రస్తుతం 1945 పేరుతొ తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో నటిస్తున్న రానా కు మరో క్రేజీ అవకాశం వచ్చింది. అదేమిటంటే .. మరో చారిత్రక నేపథ్యం లో తెరకెక్కే సినిమా ఛాన్స్ వచ్చింది. అప్పట్లో టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి గజదొంగ లా మారి దోచిన ధనమంతా పేదలకు పంచి రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్నాడు. నాగేశ్వర రావు బయోపిక్ గా రూపొందే ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తాడట. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న వంశీ ప్రస్తుతం రానాకు ఈ కథ వినిపించే పనిలో ఉన్నాడు. ఒకవేళ రానా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడంటే మరో భిన్నమైన సినిమా వచ్చినట్టే.