కృష్ణవంశీ కి ఆ హీరో నో చెప్పాడా?

Wednesday, March 21st, 2018, 04:59:13 PM IST

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమైన సీనియర్ దర్శకుల్లో కృష్ణ వంశీ కూడా ఉన్నారని అందరికి తెలిసిన విషయమే. గత ఏడాది వచ్చిన నక్షత్రం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పటికీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కృష్ణ వంశీ ఇతర హీరోలతో సినిమా చేయడానికి అవకాశాలు అందడం లేదు. ఇప్పటివరకు ఈ సీనియర్ దర్శకుడు కొంచెం మీడియం మార్కెట్ ఉన్న హీరోలకు కథలు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోలేదు.

ఇకపోతే ఫైనల్ గా తేజ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి మళ్లీ సక్సెస్ లోకి తెచ్చిన హీరో రానానే నమ్ముకున్నాడట. కొన్ని నెలల క్రితం వినిపించిన కాన్సెప్ట్ రానాకి నచ్చడంతో సానుకూలంగా స్పందించాడట. పూర్తిగా స్క్రిప్ట్ నచ్చితే షూటింగ్ స్టార్ట్ చేద్దామని అఫర్ కూడా ఇచ్చాడట. కానీ కృష్ణవంశీ రానా ని స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయాడని తెలుస్తోంది. కథ బాగాలేదు అని చెప్పడంతో కృష్ణ వంశీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రానా ఓ వైపు తమిళ్ లో కూడా తన ప్రతి సినిమాను రిలీజ్ చేయాలనిక్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం ద్విభాషా చిత్రాల్లో రానా నటిస్తున్నాడు.