ఆ ఎంఎల్ఏతో రానా… రొమాన్స్ ?

Wednesday, January 25th, 2017, 11:46:53 AM IST

catherine-tresa-and-rana
ఏంటి టైటిల్ విని షాక్ అవుతున్నారా .. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానా ఏ ఎంఎల్ఏ తో రొమాన్స్ చేస్తున్నాడో అన్న ఆసక్తి కలిగిందా .. ? అయితే ఈ విషయం విన్న తరువాత మీకే తెలుస్తుంది.. ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ”ఘాజి” సినిమాలో నటిస్తున్న రానా ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో నటిస్తున్న ”నేనే రాజు నేనే” మంత్రి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా లేటెస్ట్ గా అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హాట్ భామ కేథరిన్ ట్రెసా నటిస్తుందట!! ఆ సినిమాలో ఎంఎల్ఏ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్ ఇందులో కూడా పొలిటికల్ నేపథ్యం ఉన్న పాత్రలోనే కనిపిస్తుందని సమాచారం? లేటెస్ట్ గా మెగాస్టార్ ”ఖైదీ నంబర్ 150” వ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ మిస్ అయింది.